ETV Bharat / state

దంతాలపల్లిలో ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు - మహబూబాబాద్ జిల్లా తాజా సమాచారం

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులోని అసైన్డ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను నిర్మించారని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జేసీబీలతో సుమారు నలభై ఇళ్లను నేలమట్టం చేశారు.

houses collapsed by revenue officers in danthalapalli mahaboobabad dist
దంతాలపల్లిలో ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
author img

By

Published : Nov 23, 2020, 1:32 PM IST

ఎలాంటి అనుమతి లేకుండా అసైన్డ్​ భూముల్లో ఇళ్లు నిర్మించారంటూ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులోని బొడ్లడ స్టేజీ వద్ద తెల్లవారుజామున దాదాపు 40 ఇళ్లను తొలగించారు. తమ నివాస గృహాలను అకారణంగా తొలగించాలంటూ పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.

గతంలో ఆ భూమిని దళితులకు కేటాయించగా వారు ఇతరులకు విక్రయించారు. ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంగా మారడంతో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేశారు. నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో 8 మండలాల పోలీసు సిబ్బంది సహకారంతో జేసీబీలు తెచ్చి పని పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో కొమురయ్య, డీఎస్పీ సురేశ్, తహసీల్దార్ కోమల దగ్గరుండి పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:అగ్రనేతల ప్రచారంతో వేడెక్కిన బల్దియా.. గల్లీగల్లీలో పర్యటనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.