బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో గత నాలుగు రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్గానికి వాగులు... వంకలు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. రహదారులన్నీ జలమయంగా మారాయి.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన గంగారం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, గూడూరు, మండలాలలో కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షానికి జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. వట్టివాగు పొంగి ప్రవహిస్తుండటం వల్ల గుడూరు... నుంచి కేసముద్రం, నర్సంపేట, మహబూబాబాద్, నెక్కొండ, మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గార్ల నుంచి ఖమ్మం, మహబూబాబాద్, డోర్నకల్లకు, నెల్లికుదురు మండలంలో రావిరాల చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నండటం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఈ ప్రవాహాన్ని దాటకుండా పోలీసులు బారీకేడ్లు పెట్టి పహరా కాస్తున్నారు.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!