కార్తికమాసం పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో తెల్లవారుజామునే చన్నీళ్లతో స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందని అందరూ నమ్ముతారు. అలాగే ప్రతి సోమవారం శివాలయాలాల్లో భక్తులు పూజలు చేస్తారు. అలాగే శివాలయానికి భక్తులకు ఓ వింత అనుభూతి ఎదురైంది. ఆ గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలోని (Sivalayam temple well) బావి నుంచి వేడి నీళ్లు రావడం(heat water from well) భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ అరుదైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి( Sivalayam temple in Inugurthy village) గ్రామంలో జరిగింది.
ఎవరూ నమ్మలేదు
మొదట ఆలయంలో పనిచేసే గ్రామస్థురాలు సుగుణ చెబితే ఎవరూ నమ్మలేదు. ప్రస్తుతం కార్తికమాసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వింత చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. ఇది శివుని మహిమ అని భావించిన భక్తులు బావికి (sivalayam well) పూజలు చేస్తున్నారు.
ప్రభుత్వం పరిశోధించాలి
నాలుగు నెలలుగా బావి నుంచి వేడినీళ్లు రావడం నిజంగా జరుగుతోందా.. లేదా దేవుని మహిమతో ఈ విధంగా జరుగుతోందా అన్నది ప్రభుత్వమే తేల్చాలని గ్రామస్థులు, ఆలయ పూజారి కోరుతున్నారు. కాకతీయుల కాలంనాటి పురాతన శివాలయాన్ని(పునరుద్ధరించాలని గతంలో గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుని పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. అందువల్లో ఇలా జరుగుతోందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదా భూమి పొరల్లో వచ్చే మార్పుల వల్ల జరుగుతుందా అనేది ప్రభుత్వం, శాస్త్రవేత్తలు నిర్ధారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
నాలుగు నెలల నుంచి నీళ్లు ఇట్లనే వస్తున్నాయి. కార్తిక మాసం నుంచి బాగా వేడినీళ్లు వస్తున్నాయని నరసింహ గుడి పూజారికి చెప్పినా. నేను ఇంతకుముందు చెప్పితే ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు అయ్యగారు అందరికే చెబితే జనాలు పట్టించుకున్నరు.
-సుగుణ, దేవాలయంలో పనిచేసే మహిళ
ఈ మధ్య కాలంలో శివాలయంలోని బావిలో 24 గంటలు వేడిగా ఉంటున్నాయి. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గత రెండు నెలలుగా ఇదే జరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిపై అధికారులు స్పందించి శాస్త్రవేత్తలతో పరీక్షించాలని కోరుతున్నాం.- కృష్ణమాచారి, పూజారి
ఇది చాలా పాతబావి. కాకతీయుల కాలం నాటిది. ఈ బావి నుంచి వేడి నీళ్లు రావడం జరుగుతోంది. కార్తికమాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కావున ప్రభుత్వం దీనిపై పరిశోధన చేసి కారణాలను నిగ్గు తేల్చాలని కోరుతున్నాం- కట్టయ్య, గ్రామస్థుడు
ఇవీ చూడండి: