మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డోర్నకల్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లో విజయదశమిని పురస్కరించుకొని ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నియోజక వర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయుధ పూజలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు తమ వాహనాలకు పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం జమ్మి వృక్షం వద్ద ఆయా గ్రామాల ప్రజలు పూజలు చేశారు. పాలపిట్టను చూసేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు. మరిపెడలో రావణవథ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇవీ చూడండి: రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు