మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం, గార్ల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు చేరి ధాన్యం రాసులు నీట మునిగాయి.
ధాన్యం, మొక్కజొన్నల రాశులపై టార్పాలిన్లు కప్పినా.. కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరడం వల్ల ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. తూకం వేసి మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాలు సైతం తడిసిపోయాయి. తడిసిన తమ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.