ETV Bharat / state

ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

author img

By

Published : Mar 9, 2020, 12:18 PM IST

చేసే ప్రతి పనిలో ఆయన మార్క్​ కనబడుతోంది. ఆయన పేరు చెబితే.. అవినీతి అధికారుల వెన్నులో వణుకుపుడుతోంది. తన రూటే సపరేటు అంటూ విధులు చేపట్టిన తొలిరోజు నుంచే దూసుకెళ్తున్నారు మహబూబాబాద్​ కలెక్టర్​ గౌతమ్.

government officials are freaking afraid of mahaboobabad district collector goutham
ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు
ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

మహబూబాబాద్​ కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వీపీ గౌతమ్​... పరిపాలనలో దూకుడు పెంచారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏ చిన్న తప్పు కనిపించినా చర్యలు తీసుకోవడానికి వెనకాడటం లేదు.

ఏజెన్సీ ఏరియా కావడం వల్ల ఇంతకాలం ఉద్యోగులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది! కానీ కలెక్టర్​గా గౌతమ్​ బాధ్యతలు చేపట్టాక ఆకస్మిక పర్యటనలు చేయడం మొదలు పెట్టారు. ఎస్సీ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. వారితో భోజనం చేస్తూ నాణ్యత పరిశీలించారు.

ఎప్పుడు ఏ విభాగంలో తనిఖీ చేస్తారో తెలియక వివిధ డిపార్ట్​మెంట్ల అధికారులు గాబరా పడుతున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ... ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెట్లను తీయకపోతే భారీ జరిమానా విధించమని అధికారులను ఆదేశిస్తున్నారు. జిల్లాలో సమస్యలను పరిష్కరిస్తూనే, పాలనను గాడిలో పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.