మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన మల్సూర్ విద్యుదాఘాతంతో మరణించగా... జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అతని కుటుంబాన్ని పరామర్శించారు. మేయర్ రామ్మోహన్ మహబూబాబాద్ చేరుకొని... స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి మల్సూర్ వెళ్లారు. బాల్య స్నేహితుడి మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అతని అంత్యక్రియలలో పాల్గొన్నారు.
తన బాల్య స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందడం బాధాకరమని మేయర్ రామ్మోహన్ అన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అతని కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్