మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రైల్వే స్టేషన్, కూరగాయల మార్కెట్, ఆర్తిగార్డెన్ వద్ద భారీ వృక్షాలు విరిగిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు జేసీబీ సహాయంతో వృక్షాలను తొలిగించారు.
ఇదీ చూడండి : ఆడుకుంటూ వెళ్లి ఆరేళ్ల బాలుడు మృతి