మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లిలో చేపల లూటీ జరిగింది. గ్రామంలోని పెద్ద చెరువులో మత్య్సకారులు చేప పిల్లలు పెంచుతున్నారు. కొందరు గ్రామస్థులు, పక్క ఊళ్లకు చెందిన వాళ్లు చేపలు పట్టుకెళ్లారు. కాపాలదారుడు నాగేందర్, ఆయన భార్య రాములమ్మ ఎంత బతిమాలినా పట్టించుకోకుండా చెరువులోకి దిగారు. దొరికిన కాడికి చేపలు పట్టుకున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు