మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బొంబాయి ఊర చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా ఓ భారీ మొసలి వలకు చిక్కింది. సుమారు 80 కేజీల బరువు, 7 ఫీట్ల పొడవు ఉన్న మొసలి వలలో చిక్కటంతో మత్స్యకారులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మొసలిని తీసుకెళ్లి పాకాల సరస్సులో వదిలేశారు. మొసలిని చూడటానికి ప్రజలు చెరువు వద్దకు భారీ సంఖ్యలో వచ్చారు. గత కొన్ని రోజులుగా మొసలి చెరువులో ఉండటంతో రైతులు, మత్స్యకారులు భయపడ్డారు. చివరికి మొసలి చిక్కటంతో వారంతా ఊపిరి పిల్చుకున్నారు.
ఇదీ చదవండి: దేశం కోసం... దేశం మెచ్చేలా.. కేడెట్ టు ఆఫీసర్