మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారంలోని గాజులకుంట చెరువులో చేపల లూటీ జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చేపలను పట్టుకెళ్లారు.
పెద్దనాగారం, పెద్దనాగారం స్టేజీ ఈ రెండు గ్రామ పంచాయతీల మధ్య గాజులకుంట చెరువుపై గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. చెరువు పాత గ్రామానికి చెందినదంటూ కొందరు.. కొత్త పంచాయతీ పరిధిలోకి వస్తుందంటూ మరికొందరు చెబుతుండటం వల్ల వివాదం తలెత్తింది.
ఇదే అదునుగా భావించిన పలువురు చెరువులోని చేపల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. చెరువులోకి దిగి వలలతో చేపలు పట్టుకున్నారు. కరోనా నేపథ్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా జనం చేపల కోసం గ్రామానికి వచ్చి వెళ్లడం వల్ల.. గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.