మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ పెద్ద చెరువులో ప్రజలు పెద్ద ఎత్తున చేపలవేటకు దిగారు. చెరువులో నీరు అడుగంటిపోవడం వల్ల పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నీటిలోకి దిగి చేపలు పట్టారు. మగవారితో పాటు మహిళలూ వలలు, చీరలతో వేటకు వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలతో చెరువులో జనసందోహం నెలకొంది.
ఇదీ చదవండిః పారిస్: హ్యాపీ బర్త్ డే టు 'ఈఫిల్ టవర్'