మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మొదగులగడ్డ తండాకు చెందిన అంగోతు బాబు, దారావత్ సిరియా అనే ఇద్దరు రైతులు.. వ్యవసాయ భూమిలోని విద్యుత్ మోటారును తీసుకురావడానికి ఆకేరు వాగు దాటేందుకు వెళ్లారు. కొంత వరకు వెళ్లాక.. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా రైతులిద్దరూ వాగు మధ్యలో చిక్కుకుపోయారు.
విషయం తెలుసుకున్న తండావాసులు హుటాహుటిన వాగు వద్దకు చేరుకున్నారు. తాళ్ల సాయంతో రైతులిద్దరినీ వాగులోంచి బయటకు లాగారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీచూడండి: వరదలో చిక్కుకున్న కూలీలు.. రెస్క్యూ టీమ్ పంపిన ఎమ్మెల్యే