ETV Bharat / state

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం - సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన రెవెన్యూ బిల్లును హర్షిస్తూ.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కావడంతోనే అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.

farmers-tractors-rally-mla-anointed-to-milk-cm-kcr-at-mahabubabad
రైతుల ట్రాక్టర్ల ర్యాలీ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
author img

By

Published : Sep 24, 2020, 4:01 PM IST

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

చరిత్రలో ఏ పాలకులు.. ఏ ప్రభుత్వాలు అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచించలేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన రెవెన్యూ బిల్లుకు మద్దతుగా.. కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ట్రాక్టర్​ను స్వయంగా నడుపుకుంటూ వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కావడంతోనే రైతుల సంక్షేమం కోసం 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటీ 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని, రైతులకు వ్యతిరేకంగా ఉన్న విద్యుత్ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో తెరాస నాయకులు, కార్యకర్తలు వందలాది ట్రాక్టర్లతో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : 'దేశవ్యాప్త బంద్​ను విజయవంతం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.