అకాల వర్షాల కారణంగా దిగుబడి రాక నష్టపోయిన రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లులో రహదారిపై బైఠాయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పండించిన సన్నవరి ధాన్యాన్ని క్వింటాలు రూ.2500 లతో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఏడాది తెగుళ్ల వల్ల కాటుక సోకిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతన్నల నుంచి అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతన్నలకు నచ్చజెప్పారు. ప్రభుత్వ నిబంధనలతో ధాన్యాన్ని కొంటామని వ్యవసాయ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.