మిర్చి ధర తగ్గించారంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం ఉదయం క్వింటా రూ.15,700 ధర పలుకిన మిర్చీ, మధ్యాహ్ననికి రూ.14,500కి పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంటకు మద్ధతు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు.
రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని సురేఖ వారితో మాట్లాడారు. తక్కువ ధర పలికిన రైతుల పంటను వేలం వేసి.. న్యాయం చేస్తానని హామీని ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారిని సురేఖ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కొనుగోలు సామర్థ్యం నాలుగు వేల బస్తా లేనని.. ఈ రోజు 6 వేల బస్తాల మిర్చి వచ్చిందని తెలిపారు. నిన్నటి 5 వేల బస్తాలు యార్డులోనే మిగిలిపోయాయని పేర్కొన్నారు. మార్కెట్లో ఆరు ట్రేడర్సే ఉన్నందున మిర్చి ఎక్కువ వచ్చిన సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మార్కెట్ ఇంకా రెండు నెలల పాటు కొనసాగుతుందని, రైతులు ఒకేసారి తమ పంటను తీసుకురాకుండా.. మార్కెట్ పరిస్థితులను గుర్తించి దశల వారిగా రావాలని సూచించారు.
ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్యతో తెరాసకు సంబంధం లేదు: సీఎం