crops protect with tiger: కోతుల బెడదతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు అన్నీఇన్నీ కావు. చేతికొచ్చిన పంట వన్యప్రాణుల పరం కాకుండా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. పులి బొమ్మతో వాటి బారి నుంచి పంటకు రక్షణ కల్పించుకుంటున్నారు.
రూ.3వేలు ఖర్చు: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో కోతుల బెడద అధికంగా ఉంది. వాటి నుంచి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ముందుకు సాగుతూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మండల కేంద్రానికి చెందిన కొమ్ము శ్రీరాములు అనే రైతు వినూత్నంగా ఆలోచన చేసి వరి పంటను కాపాడుకుంటున్నారు. శ్రీరాములు రూ.3 వేలు పెట్టి ఓ పులి బొమ్మను కొనుగోలు చేసి.. ప్రతిరోజూ ఉదయం తన పొలం వద్దకు వెళ్లేటప్పడు ఆ బొమ్మను తీసుకెళ్లి పొలం మధ్యలోని ఎత్తైన బండరాయిపై పెడుతున్నారు.
కనిపించే పులి బొమ్మను చూసి వానరాలు నిజమైన పులిగా భావించి అటు వైపు రాకుండా పలాయనం చిత్తగిస్తున్నట్లు రైతు తెలిపారు. పులి బొమ్మతో కోతుల బాధ తప్పిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాములును ఆలోచనను వారు మెచ్చుకుంటున్నారు. తమ పొలాల్లోనూ ఇలాంటి బొమ్మను కొనుగోలు చేసేందుకు గ్రామంలోని ఇతర రైతులు కూడా ఉత్సాహం చూపుతున్నారు.
ఇదీ చదవండి: Pet Lover : మూగజీవాలంటే ఆమెకు ప్రాణం.. అందుకే