యూరియా బస్తాలను అందించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సెంటర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. వెంటనే యూరియా బస్తాలు అందించాలంటూ... నినాదాలు చేశారు. దీంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ రవికుమార్, వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డిలు రాస్తారోకో వద్దకు వచ్చారు. యూరియా బస్తాల కొరత లేదని తెలిపారు. రబీ పంట కోసం యూరియా దాచుకుంటున్నారని జిల్లా వ్యవసాయ అధికారి పత్రికకు తెలిపిన సమాచారంపై నిలదీశారు.
యూరియా బస్తాలను వెంటనే అందిస్తామని వ్యవసాయ అధికారి హామీని ఇవ్వగా రైతులు రాస్తారోకోను విరమించారు.
ఇదీ చూడండి: పద్దులకు శాసనసభ ఆమోదం...