ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూసపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వల్లాల రవికుమార్ అతని ఇద్దరు చెల్లెళ్ళు రజిత, లలితలు నాలుగు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. పట్టాలో మాత్రం మూడు ఎకరాలు నమోదైంది. వీరి దాయాదుల రికార్డ్స్‌లో భూమి ఎక్కువగా నమోదైంది.
భూరికార్డులను సరిచేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ఇవాళ అధికారులను మరోసారి కలిశాక కూడా ఫలితం కనిపించలేదు. మనస్తాపంతో ఇంటికొచ్చాక.. ముగ్గురు పురుగుల మందు తాగారు.
బాధితులు ప్రస్తుతం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ తెలిపారు.