ETV Bharat / state

వరుణ బీభత్సం... పునరావాస కేంద్రాలకు జనం - Mahabubabad District latest News

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బంజరతండా వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలు తగ్గే వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా కల్పించారు.

భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతం... పునరావాస కేంద్రాలకు తరలింపు

author img

By

Published : Aug 16, 2020, 7:34 PM IST

భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బంజరతండా వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండల కేంద్రం శివారులో పొంగి ప్రవహిస్తున్న పాకాల వాగులను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందుతో కలిసి పరిశీలించారు. పాకాల వాగు ఉద్ధృత ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయిన రాంపురం, మద్దివంచ గ్రామాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మంత్రి ఆదేశాలతో వారికి అన్ని వసతులను కల్పించారు. కేంద్రంలో నిరాశ్రయులకు బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి సత్యవతి పంపిణీ చేశారు. వర్షాలు తగ్గే వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా కల్పించారు. పాకల చెక్ డ్యామ్ ఎత్తు పెంచి రాంపురం... మద్దివంచ గ్రామాల ప్రజల ఇబ్బందులను తీర్చాలని ప్రజలు మంత్రికి విన్నవించారు.

సురక్షిత ప్రాంతాలకు తరలించాలి...

అనంతరం మంత్రి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్​లతో ఫోన్​లో మాట్లాడారు. అనంతరం ములుగు జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏజన్సీ ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే గిరిజనులు, ఆదివాసీలను సమీపంలో ఉన్న గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, పునరావాసం కల్పించాలని కోరారు. వరదల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని అందించాలన్నారు.

ఇవీ చూడండి : 'ఉదారవాద ఆలోచన గల మహా నేత వాజ్​పేయీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.