ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ నరేష్ అంత్యక్రియలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగాయి. నరేష్ సొంతూరు సూర్యాపేట జిల్లా గోరెంట్ల కాగా... కొంతకాలంగా ఎల్లంపేటలోని అత్తగారింట్లో ఉంటూ మహబూబాబాద్‌లో స్థిరపడ్డారు. నరేష్ మృతదేహానికి మహబూబాబాద్‌లోని ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఎల్లంపేటకు తీసుకొచ్చారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
బాధిత కుంటుంబాన్ని పరామర్శించిన నేతలు
మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్థులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాధిత కుటుంబాన్ని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, పీవోడబ్ల్యూ కేంద్ర కమిటీ కన్వినర్ సంధ్య పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అశ్రునయనాల మధ్య నరేశ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'