మాస్కుల పంపిణీ కార్యక్రమం ఘర్షణకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లిలో మాస్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సోమలక్ష్మి భర్త మనోహర్ గ్రామంలోని ఒక వర్గం వారికి మాస్కులు అందజేశారు. ఫలితంగా తమకెందుకు ఇవ్వడం లేదంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ