మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో జర్నలిస్టులకు మాస్క్లు, శానిటైజర్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీనివాసరావు అందజేశారు. జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కోవిడ్-19 సమయంలో రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారన్నారని కలెక్టర్ అన్నారు.
ఎప్పటికప్పుడూ వాస్తవ పరిస్థితులను ప్రజలు ఆందోళన చెందకుండా తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు ఇబ్బంది పడకుండా వీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
ఇదీ చూడండి : సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు