హైదరాబాద్‌లోని పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్‌లో న్యాయవాదులు , ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. విగ్రహాన్ని కూల్చి వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగకర్త అంబేడ్కర్‌ను ఈ విధంగా అవమానపరచడం బాధాకరమని హైకోర్టు న్యాయవాది రహీం పటేల్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి: దత్తాత్రేయ