కన్న తల్లిదండ్రులను చూసుకోకుండా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సిగ్గు చేటేనని మహబూబాబాద్ కలెక్టర్ గౌతం పేర్కొన్నారు. జిల్లాలోని సికింద్రాబాద్ తండాలోని దైవ కృప వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదరణ వృద్ధుల ఆశ్రమం తృతీయ వార్షికోత్సవంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆశ్రమంలోని వృద్ధుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఓల్డేజ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన మథర్ థెరిస్సా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ మెయింటెనెన్స్ 2006 యాక్ట్ గురించి వివరించారు. ఈ చట్టం ప్రజల్లోకి వెళ్లలేదని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులు, స్వచ్ఛంద సంస్థలపై ఉందన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంపై సూర్యుడి సెగ.. రానున్న 3 రోజులు భగభగలే..'