మహబూబాబాద్ పట్టణం ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న చెట్లకు ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు దైద వెంకన్న రాఖీ కట్టారు. చెట్లను రంగు తీగలు, కుంకుమ... పసుపుతో అలంకరించారు. చెట్టను మనం సంరక్షిస్తే అవి మన సోదరులలాగా వచ్చే తరాలకు సైతం రక్షణను కల్పిస్తాయని వెంకన్న వెల్లడించారు.
గత 6 సంవత్సరాలుగా చెట్లను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి... వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని... రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ మర్నేని. వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ చెట్లకు రాఖీలు కట్టారు. చెట్లకు కూడా రాఖీ కట్టడం మంచి కార్యక్రమమని కౌన్సిలర్ వెంకన్న అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు