ప్రముఖ ఆన్లైన్ సంస్థ అమెజాన్లో బుక్ చేసినవి కాకుండా వేరే వస్తువులు వచ్చిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన సాయిరామ్ అనే వ్యక్తి తన అవసర నిమిత్తం 10 రాక్స్, 1 షెటర్ను అమెజాన్లో బుక్ చేసుకున్నాడు.
డెలివరీ బాయ్ వస్తువులను తీసుకొని సాయిరాంకు అప్పజెప్పాడు. డెలివరీ బాయ్ ముందే సాయిరాం వాటిని విప్పి చూడగా.. ర్యాక్స్కు బదులు కండోమ్ ప్యాకెట్లు, షెటర్కు బదులుగా చీరా, జాకెట్లు వచ్చాయి. వాటిని చూసి కంగుతిన్న అతను.. మోసపోయానని గ్రహించి మీడియాను ఆశ్రయించాడు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఆన్ లైన్ వైపు మొగ్గుచూపుతున్నారని, ఈ విధంగా ప్రజలను మోసం చేయొద్దని కోరాడు.
ఇదీ చూడండి: తల్లితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిన అక్కాచెల్లెళ్లు