మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందింది. గడ్డి మేసుకుంటూ వెళ్తున్న ఆవుకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తీగలు తగిలాయి. బైపాస్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ పక్కన విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. యజమాని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. బాటసారులు అడ్డుకుని నెట్టి వేయడం వల్ల ఆ రైతు ప్రాణాలు దక్కాయి.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆవు మృతి చెందిందని బాధిత కుటుంబం వాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు