ETV Bharat / state

వైరస్ సామాజిక వ్యాప్తితో పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

మహబూబాబాద్​ జిల్లాలో కరోనా వైరస్​ సామాజిక వ్యాప్తి చెందినట్టు వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 5 వరకు 3,081 టెస్టులు నిర్వహించగా... 935 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది కరోనా బాధితులకు ఐసోలేషన్​ కిట్లు ఇచ్చి, వైద్య సేవలు అందిస్తున్నారు.

author img

By

Published : Aug 6, 2020, 5:31 PM IST

mahabubabad
వైరస్ సామాజిక వ్యాప్తితో పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. వైరస్ సామాజిక వ్యాప్తి చెందిందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆగస్టు 5 బుధవారం వరకు 3,081 టెస్టులు నిర్వహించగా, 935 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 681 కేసులు యాక్టివ్​లో ఉండగా, 243 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మృతి చెందారు. 19 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 19 మంది ప్రభుత్వ క్వారంటైన్​లో, 643 మంది హోమ్ ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నట్టు జిల్లా కోవిడ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్ వెల్లడించారు.

మారుమూల ప్రాంతాలక్కూడా..

జిల్లాలోని 16 మండలాల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు కూడా ఈ మహమ్మారి విస్తరించినట్టు వైద్యశాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో వైరస్ బారిన పడిన వారిలో అత్యధికంగా... వైద్య ఆరోగ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆ తరువాత స్థానాలలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు. కలెక్టరేట్​, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ కార్యాలయాలు బోసిపోయాయి. జిల్లాలో కొవిడ్-19 కు ముగ్గురు కో-ఆర్డినేటర్​లు ఉండగా... అందులో ఒకరికి వైరస్ సోకింది.

పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు

కరోనా బాధితుల్లో నాలుగు నెలల శిశువు నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్న వారికి వైద్య సిబ్బంది కరోనా కిట్లు అందించి... వైద్య సేవలు అందిస్తోంది. జిల్లా కలెక్టర్ గౌతమ్ స్వయంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మనో ధైర్యం నింపుతున్నారు.

మర్కజ్ యాత్రికులతో ఢిల్లీ నుంచి రైల్లో జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తికి ఏప్రిల్ 2న తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మే, జూన్​లో జిల్లావ్యాప్తంగా రెండంకెల్లో మాత్రమే ఉన్న కేసులు... జులై మొదటి వారం నుంచి విపరీతంగా పెరుగుతు వస్తున్నాయి. జూన్ 30 వరకు 28 కేసులు మాత్రమే నమోదు కాగా, జూలై 31 వరకు 720కి, ఆగస్టు 5 వరకు 935కు చేరుకున్నాయి.

పడకల అందుబాటు..

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 12 పడకలు, గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 పడకలు, తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 పడకలు, కలెక్టరేట్​ సమీపంలోని గిరిజన గురుకుల విద్యాలయం 100 పడకలు ఉన్నాయి. అనంతారంలోని ఆదర్శ పాఠశాల వసతి గృహంలో 30 పడకల సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయంతో, 45 పడకల ఐసోలేషన్ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభమైతే జిల్లాలో మొత్తం కోవిడ్ బాధితులకు 227 పడకలకు చేరుకుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.