ETV Bharat / state

ప్రజల్లో అవగాహన కల్పిస్తూ..  బాధితులకు ధైర్యం చెబుతూ..

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి.. ఇళ్లకే పరిమితం కావాలని సూచించాయి.. ఇందుకనుగుణంగా వివిధ శాఖలు కదులుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తూనే.. తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాయి.

corona control measures, mahabubabad officers covid measures
కరోనా కట్టడి చర్యలు, కొవిడ్ కట్టడికి అధికారుల చర్యలు
author img

By

Published : May 17, 2021, 11:46 AM IST

పల్లెలు, పట్టణాలను గడగడలాడిస్తున్న కరోనా రెండో దశ వైరస్‌ను అధికారులు సమర్థంగా ఎదుర్కొంటున్నారు. గత నెల నుంచే అప్రమత్తమై కట్డడికి యుద్ధం చేస్తున్నారు. పాజిటివ్‌ రేట్‌ను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్‌ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. పంచాయతీలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సిబ్బంది పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులూ రంగంలోకి దిగి కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలకు ఉపక్రమించారు. బాధితులకు తమవంతు సహకారాలు అందిస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రులకు వెళ్లి బాధితులతో మాట్లాడుతూ.. వారికి ధైర్యం చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతూ.. అవగాహన కల్పిస్తున్నారు. మండల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.

తనిఖీ చేస్తూ.. జరిమానాలు విధిస్తూ..

రాత్రి పూట కర్ఫ్యూను పటిష్ఠంగా అమలు చేశారు పోలీసులు. గ్రామాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు పెట్టుకోకుండా తిరుగుతున్న వారిని గుర్తించి.. జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పుడు సర్కారు లాక్‌డౌన్‌ విధించడంతో ఉదయం 10 గంటల తర్వాత రహదారులపై పహారా కాస్తున్నారు. అక్కడక్కడ పికెటింగ్‌ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీస్‌శాఖ జారీ చేసిన ఈ-పాస్‌ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సీపీ మొదలుకుంటే అందరూ నిత్యం తనిఖీ చేస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో 200, భూపాలపల్లి జిల్లాలో 60 మంది, ములుగు జిల్లాలో 120 మంది కరోనా కట్టడిలో భాగస్వాములవుతున్నారు.

తనిఖీ కేంద్రాలు

  • వరంగల్‌ కమిషనరేట్‌ 18
  • ములుగు 7
  • జయశంకర్‌ 3
  • మహబూబాబాద్‌ 22

ఆదిలోనే గుర్తించడానికి..

ఆదిలోనే అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టింది. గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీలో మున్సిపల్‌ సిబ్బంది ఇంటింటికి తిరిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు కొన్ని లక్షల ఇళ్లలో సర్వే చేపట్టారు. 25 వేల మందికిపైగా కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలున్న వారిని గుర్తించారు. వారికి ఐసోలేషన్‌ కిట్లు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పాజిటివ్‌ వచ్చిన వారి ఇళ్లకు ఆశలు నిత్యం వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇబ్బందికరంగా ఉన్న వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు పంపిస్తున్నారు.

రెవెన్యూ సేవలు

బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా రెవెన్యూ అధికారులు సేవలు అందిస్తున్నారు. క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయించారు. బాధితులకు అందుబాటులో వీఆర్వోలు ఉంటున్నారు. వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో పాజిటివ్‌ వచ్చిన వారు ఇంట్లో ఐసోలేషన్‌ చేసేలా.. వారు బయటకు రాకుండా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. శుభకార్యాల్లో అధిక మొత్తంలో ప్రజలు ఉండకుండా చూస్తున్నారు.

రసాయన ద్రావణం పిచికారీ చేస్తూ..

వైరస్‌ నియంత్రణలో పారిశుద్ధ్య పనులు ముఖ్యమే. ఒక చోట నుంచి మరో చోటకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పల్లెలు, పట్టణాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 1,688 గ్రామపంచాయతీలతో పాటు తొమ్మిది మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని పాజిటివ్‌ కేసులు ఉన్న ఇళ్ల ముందు నిత్యం బ్లీచింగ్‌ చల్లుతున్నారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. జిల్లా పంచాయతీ, మండల పరిషత్తు అధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ.. సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, పాలకవర్గ సభ్యులు ముందుండి పనులు చేయిస్తున్నారు. కరోనాతో చనిపోతే సిబ్బందితో అంత్యక్రియలు చేయిస్తున్నారు.

ప్రత్యేకాధికారుల నియామకం

గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు రాకుండా కట్టడి చేసేందుకు మండలానికొకరి చొప్పున వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వారు నిరంతరం ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానాలను విధిస్తున్నారు. పండుగలు, శుభకార్యాలు చేస్తున్న ప్రాంతంలో అధిక మొత్తంలో జనాభా ఉంటే చర్యలు తీసుకుంటున్నారు. అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని చెబుతున్నారు. కరోనా వచ్చిన వారు ధైర్యంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు. చుట్టుపక్కల వారు బాధితులకు సహాయం చేయాలంటూ చెబుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రుల దందా.. రూ.23 లక్షల బిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.