మహబూబాబాద్‌లో సమీకృత మోడల్ మార్కెట్ ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయాన్ని, గోడౌన్ల పరిసర ప్రాంతాలను జిల్లా పాలనాధికారి వి.పి. గౌతమ్ ఆకస్మికంగా పరిశీలించారు. సాధ్యాసాధ్యాల గురించి అధికారులతో చర్చించారు.
అనంతరం వ్యవసాయ శాఖ పక్కన గల కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. విక్రయదారులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. మంచినీటి సౌకర్యం లేదని విక్రయదారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వెంటనే నల్లాలను ఏర్పాటు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి : కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు