ఎన్నికల్లో ఓటమి భయంతో ఎంపీటీసీ అభ్యర్థి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఒకవైపు అప్పులు, మరోవైపు గెలుపుపై ఆశలు సన్నగిల్లి మనస్థాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత ఏడు ఏళ్లుగా తెరాసలో క్రియాశీలకంగా పని చేసినందుకు మొదట సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీగా తెరాస నుంచి అవకాశం కల్పిస్తామని హామి ఇచ్చి ఆపై మెుండిచేయి చూపించారని భార్య దుర్గ ఆవేదన వ్యక్తం చేశారు. పరిషత్ పోరులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాములు... కాంగ్రెస్ భీ ఫాం తీసుకుని బరిలో నిలిచారు. ఎన్నికల్లో 30 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. ఇప్పుడు ఓడిపోతాననే భయం, అప్పు తీర్చే మార్గం లేక ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితుడి భార్య తెలిపింది.
'ఓటమి భయంతో ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం' - RAMULU
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో మహబూబాబాద్ జిల్లాలోని ఓ ఎంపీటీసీ అభ్యర్థి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..స్పందించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.