ETV Bharat / state

పీహెచ్​సీ వైద్యుడికి సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ అభినందన - పీహెచ్​సీ వైద్య బృందానికి స్మితాసబర్వాల్​ అభినందనలు

మహబూబాబాద్ జిల్లా గంగారం పీహెచ్​సీ వైద్యుడు ముక్రంను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ ట్విట్టర్​ ద్వారా అభినందించారు. ఏజెన్సీ ప్రాంతంలో రాత్రివేళ పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసిన వైద్యుడిని అభినందించారు.

smitha sabharwal appreciate phc doctor
పీహెచ్​సీ వైద్యుడికి సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ అభినందన
author img

By

Published : May 13, 2020, 10:57 PM IST

మహబూబాబాద్ జిల్లా గంగారం పీహెచ్​సీ వైద్యుడు ముక్రంను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ అభినందించారు. కొత్తగూడ మండలం పోలారం గ్రామానికి చెందిన గర్భిణి రాత్రి సమయంలో పురిటి నొప్పులు రావడం వల్ల... ఆశా కార్యకర్త, ఏఎన్​ఎం... గంగారంలోని ప్రాథమిక వైద్యశాల వైద్యుడికి సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన వైద్యుడు ముక్రం తన సొంత వాహనంలో గ్రామానికి వచ్చి గర్భణిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేశారు. ఈ సంగతి తెలిసి జిల్లా కలెక్టర్​ వి.పి.గౌతం ట్విట్టర్​ ద్వారా వైద్యుడిని అభినందించారు. విషయం తెలుసుకున్న సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ ట్విట్టర్​ ద్వారా వైద్య బృందాన్ని అభినందించారు.

smitha sabharwal appreciate phc doctor
పీహెచ్​సీ వైద్యుడికి సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ అభినందన

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.