ETV Bharat / state

నేడు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేసీఆర్​ పర్యటన

CM KCR Districts Tour Today : ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం మహబూబాబాద్, మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను.. సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం భద్రాద్రిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లుచేశారు.

CM KCR
CM KCR
author img

By

Published : Jan 12, 2023, 7:02 AM IST

CM KCR Districts Tour: ప్రభుత్వశాఖలన్ని ఒకే చోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక సేవలందించే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో కొత్త సమీకృత కలెక్టరేట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్తకలెక్టర్లేట్లు అందుబాటులోకి రాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.58కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది. 2018 ఏప్రిల్ 4న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ 20 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు.

అక్కడే పది వేల మందితో సభ నిర్వహించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 11:10 నిమిషాలకు.. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుకుంటారు. ఉదయం 11.40 నిమిషాలకు కేసీఆర్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించాక.. ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో జిల్లా గ్రంథాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు.

మహబూబాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో.. కేసీఆర్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి.. కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే ఆధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. జిల్లా పాలనాధికారి దురిశెట్టి అనుదీప్‌ను కొత్త కలెక్టరేట్ ఛాంబర్‌లో కూర్చోబెడతారు. కలెక్టరేట్‌లోని గదులు అధికారుల ఛాంబర్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

కొత్త కలెక్టరేట్​లో 46 ప్రభుత్వ శాఖలు: మొత్తం 25.16 ఎకరాల విస్తీర్ణంలో రూ.44.98 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ నిర్మించారు. 2018 ఏప్రిల్ 3న పురపాలకశాఖ మంత్రి కేసీఆర్, అప్పటి రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జీ ప్లస్ టూ పద్దతిలో నిర్మాణం చేపట్టారు. కొత్త కలెక్టరేట్​లో 46 ప్రభుత్వ శాఖలు కొలువు దీరనున్నాయి. బహిరంగ సభ తర్వాత కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కేసీఆర్‌ హైదరాబాద్‌కు బయలుదేరి రానున్నారు.

ఇవీ చదవండి: 'ఐదేళ్లుగా హైదరాబాద్​ అగ్రస్థానంలో కొనసాగుతోంది'

యువ ఇంజినీర్​​ నయా రికార్డ్ .. 43 రోజుల్లోనే బిల్డింగ్ నిర్మాణం.. ప్రపంచ రికార్డు సొంతం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.