ETV Bharat / state

దుకాణంపైకి ఎక్కాడు.. పైలోకాలకు చేరాడు - మహబూబాబాద్​లో డబ్బా దుకాణంపై వరిగడ్డి పరుస్తుండగా ప్రమాదం

ఎండ వేడికి తట్టుకోలేక డబ్బా దుకాణంపై వరిగడ్డి పరుస్తుండగా ఓ యువకునికి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించింది. ఈ తరుణంలో తీవ్రంగా గాయపడ్డ అతనిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

climbing the shop electricity accident and dead at mahabubabad
దుకాణంపైకి ఎక్కాడు.. పైలోకాలకు చేరాడు
author img

By

Published : May 29, 2020, 9:48 PM IST

డబ్బా దుకాణంపై వరిగడ్డి పరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించి ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా బంధం రోడ్​లో తాళ్లపూసపల్లికి చెందిన ప్రవీణ్ ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఎండ వేడిమి తట్టకోలేక డబ్బాదుకాణంపైకి ఎక్కి వరి గడ్డి పరుస్తున్నాడు.

ఆ క్రమంలో ప్రక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడ్డ అతనిని మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ఇదీ చూడండి : ఆవేదనతో ఉన్న అసంఘటిత కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.