మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానురాలు సత్యవతి ఉదయం బాత్రూమ్కు వెళ్లి వచ్చే సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 10 తులాల బంగారు ఆభరాణాలు చోరి చేశారు.
యాజమానురాలు ఇంట్లో ఉండగానే దోచుకెళ్లారు అనంతరం ఇంట్లోకి వచ్చిన సత్యవతి వస్తువులు చిందరవందరగా ఉండటంతో చోరి జరిగిందనే అనుమానంతో కొడుకుకి ఫోన్ చేసింది. చోరి జరగిందని నిర్థారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీమ్ సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చూడండి: మహిళ హత్యకేసులో పురోగతి... 11మంది అరెస్టు