ETV Bharat / state

సింహపురి వచ్చె.. బెల్లం తెచ్చె..!! - అక్రమదారులు

గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం అమ్మకాలపై నిషేధం ఉండడం వల్ల  వాటిని అమ్ముకునేందుకు అక్రమదారులు చేసే ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. వాహనాల్లో ఎవరికీ తెలియకుండా తయారు చేస్తే పోలీసులు పట్టుకుంటున్నారని రైళ్లలో కూడా తరలిస్తూ.. అక్రమ బెల్లాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

సింహపురి వచ్చె.. బెల్లం తెచ్చె..!!
author img

By

Published : Jul 17, 2019, 10:43 AM IST

రాష్ట్రంలో గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం అమ్మకాలపై నిషేధం ఉన్నందున అక్రమార్కులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి తీసుకొస్తున్నారు. ఇందుకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను వేదికగా మార్చుకున్నారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు జంక్షన్‌ నుంచి ప్రతి రోజు సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరుతుంది. మహబూబాబాద్‌కు అర్ధరాత్రి 1.20 గంటలకు వస్తుంది. అక్రమార్కులు ఒంగోలులో బెల్లాన్ని కొనుగోలు చేసి సింహపురి ద్వారా జిల్లాకు తీసుకొస్తున్నారు. బెల్లం మూటలను మూత్రశాలల్లో దాచిపెడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. గుండ్రాతిమడుగు రాగానే కదులుతున్న రైలు నుంచే మూటలను బయటకు విసిరేస్తున్నారు. అప్పటికే అక్కడ ఉన్న వారు వాటిని గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్తున్నారు. రైలులో ఉన్న వారు మహబూబాబాద్‌ స్టేషన్‌లో దిగిపోతున్నారు. సింహపురి అందుబాటులో లేకుంటే పద్మావతి, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆశ్రయిస్తున్నారు. అంటే అక్రమార్కులు ఎక్కువగా తెల్లవారుజామున మానుకోటకు చేరుకునే రైళ్ల ఆధారంగా బెల్లం దందా కొనసాగిస్తున్నారు.

కఠినంగా వ్యవహరిస్తేనే..

తెల్లవారు జామున వెళ్లే రైళ్లపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించకపోవడం..అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే బెల్లం తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. అర్ధరాత్రి స్టేషన్‌లో ఎవరూ ఉండరనే ఉద్దేశంతో కొందరు అధికారులు... బెల్లం వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకొని పంపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండదండలతోనే గుడుంబా తయారీ, అమ్మకాలు జరుగుతున్నట్లు పలువురు వాపోతున్నారు. ఇకపై అధికారులు.. గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసపల్లి, మహబూబాబాద్‌, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్‌ రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టాలి.

ప్రత్యేక బృందాలతో తనిఖీలు

రైళ్లలో బెల్లం తరలిస్తున్న విషయం తెలుసని జిల్లా అబ్కారీశాఖ అధికారి దశరథం తెలిపారు. అందుకే ప్రతి రైలునూ తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో ఎక్సైజ్‌, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, వరంగల్‌ ఎన్‌ఫోర్స్‌ వారు ఉన్నారని స్పష్టం చేశారు. వీరి ఆధ్వర్యంలోనే రైళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని, అవసరమైన చోట సివిల్‌ పోలీసుల సహకారం తీసుకుంటున్నమని అబ్కారీశాఖ అధికారి దశరథం వెల్లడించారు.

ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.