మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భాజపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి అర్హులైన వారందరికీ రెండు పడక గదుల ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి, సీఎం డౌన్ డౌన్, భాజపా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని సమర్పించారు.
కరోనా కష్టకాలంలో ప్రజలు తినేందుకు ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త జీవోను తీసుకొచ్చి నిరుపేదలను మరింత క్షోభకు గురిచేస్తున్నారని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేసి.. నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండిః ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నిరసనలకు భాజపా పిలుపు