ETV Bharat / state

Fertilizer Effect on Beekeeping : ఎరువుల ఎఫెక్ట్​... నేలరాలుతున్న తేనెటీగలు

రసాయన ఎరువుల ధాటికి తేనెటీగలు నేలరాలుతున్నాయి (fertilizer Effect on beekeeping). పంటలపై చల్లే ఎరువుల గాఢత వల్ల తేనెటీగలు చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

beekeeping
beekeeping
author img

By

Published : Nov 1, 2021, 6:37 AM IST

ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే తేనెను అందించే తేనెటీగలు రసాయన ఎరువుల ధాటికి నేలరాలుతున్నాయి (fertilizer Effect on beekeeping). పంటలపై చల్లే ఎరువుల గాఢత ఇందుకు కారణమవుతోంది. తేనెటీగల పెంపకాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు మహబూబాబాద్‌ జిల్లాలోని మల్యాల, మట్టెవాడ, నేరడ ప్రాంతాలకు చెందిన యువకులకు తేనెటీగల యూనిట్లను అందించారు. వారు వ్యవసాయ క్షేత్రాల్లో యూనిట్లను ఏర్పాటుచేసుకుని తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించారు. తేనెటీగలు ఒకచోట తమ స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న తర్వాత సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో మకరందం కోసం పూలు, పండ్ల తోటలను వెతుక్కుంటూ వెళ్లి మళ్లీ అక్కడకే చేరుకుంటాయి. ప్రస్తుతం యూనిట్లను ఏర్పాటుచేసిన పరిసరాల్లో మిరప, మామిడి తోటల సాగు ఎక్కువగా ఉంది. ఆయా పంటలకు ఆశించిన తెగుళ్ల నివారణతో పాటు నాణ్యమైన దిగుబడి కోసం రైతులు రసాయన ఎరువులు వేస్తున్నారు. ఫలితంగా వాటి అవశేషాలు పువ్వుల్లోకి చేరుతున్నాయి. తేనెటీగలు వాటిపై వాలి చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాం

మహబూబాబాద్‌ జిల్లాలో మిరప సాగు, మామిడితోటల పంటలపై రసాయన ఎరువులు చల్లుతున్నారు (fertilizer Effect on beekeeping). వాటి ప్రభావం తేనెటీగలపై తీవ్రంగా ఉంటోంది. దీంతో తేనె ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో తేనె ఉత్పత్తిని పెంపొందించడంపై దృష్టి సారిస్తున్నాం. - డాక్టర్‌ ఎస్‌.మాలతి, సమన్వయకర్త, కేవీకే, మల్యాల

ఎదుగుదల సమయంలో నష్టం

గతేడాది తేనెటీగలు, పెట్టెలను కేవీకే శాస్త్రవేత్తలు ఇచ్చారు. స్వయం ఉపాధిగా ఇంట్లోనే వాటి పెంపకం చేపట్టాం. కిలో తేనె సేకరించాం. ఉత్పత్తి పెరిగే సమయంలో ఎరువుల కారణంగా ఈగలు మృత్యువాత పడ్డాయి. - రాచకొండ శంకర్‌, మల్యాల.

ఇదీ చూడండి: Sadar Festival: సదర్‌ వేడుకలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. భారీ దున్నలు కనువిందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.