మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో బతుకమ్మ పండుగ సందడి నెలకొంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెత్తర అమావాస్యను పురస్కరించుకొని మహిళలు బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. అధిక ఆశ్వయుజ మాసం సందర్భంగా అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల పువ్వులతో తయారుచేసిన బతుకమ్మలతో బతుకమ్మ ఘాట్ల వద్దకు చేరుకున్నారు.
బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేశారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. అక్టోబర్ 16 నుంచి తిరిగి బతుకమ్మ వేడుకలను జరుపుకోనున్నారు. బతుకమ్మ వేడుకలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి: మానేరు వద్ద మనోహర దృశ్యం.. పర్యటకుల కోలాహలం