వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. నర్సింహులపేట మండలానికి చెందిన మౌనిక, ఉమేష్ దంపతుల 8 నెలల కూతురు జ్వరంతో బాధపడుతుండగా... తెల్లవారు జామున 4 గంటలకు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పాపను పరీక్షించిన డాక్టర్ మందులు రాసి... ఆస్పత్రిలో చేర్చాలని తెలిపారు. ఉదయం 7 గంటలకు పాప చనిపోయింది. ఆలస్యంగా వైద్యం అందించినందునే తమ కూతురు చనిపోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి ఫిర్యాదు చేయాలని సర్ది చెప్పడం వల్ల ఆందోళన విరమించారు.
'వైద్యం అందకనే పాప చనిపోయింది' - baby death
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ పాప చనిపోయిందని జిల్లా ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.