విజయదశమిని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆయుధ పూజ, వాహన పూజలను నిర్వహించారు. అనంతరం పోలీసులకు, జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ.. ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.
ఇదీ నేపథ్యం..
కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి చెట్టుపై భద్రపరిచిన ఆయుధాలకు పూజ చేసి యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో విజయం సాధించడంతో ప్రతి విజయదశమికి ముందు రోజు సైనికులు, పోలీసులు ఆయుధాలను, రైతులు తమ పనిముట్లను, వాహనదారులు వాహనాలను శుభ్రం చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించడం మహాభారత కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ చూడండి.. ఇప్పటి వరకు రూ.120 కోట్లు పంపిణీ చేశాం: సోమేశ్ కుమార్