ETV Bharat / state

జీతాలు పెంచాలని ఆశా వర్కర్ల ఆవేదన - Telangana news

వచ్చే అరకొర జీతంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని మహబూబాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న తమకి పనికి తగ్గ వేతనాలు రావడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపి త్వరగా వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Asah workers demand increase them salaries

author img

By

Published : May 31, 2021, 7:12 PM IST

కరోనా సమయంలో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న తమకి పనికి తగ్గ వేతనాలు రావడం లేదని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో దాదాపు గా 83 మంది ఆశావర్కర్లు ఉన్నారు. కరోనా మొదలయినప్పటి నుంచి తాము విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజల ఆరోగ్యాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నామన్నారు. కానీ తమ కష్టానికి తగ్గ వేతనాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు నెలకు రూ.7,200 వేతనం వస్తుందని కానీ ఆ జీతంతో తమ కుటుంబాలు గడవాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపి త్వరగా వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రస్తుతం ఆశావర్కర్లు అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వేను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన సలహాలు సూచనలు చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బట్టి వివరాలు నమోదు చేసుకొని మెడికల్ కిట్ అందిస్తున్నారు.

ఇదీ చూడండి: Sonu sood: తెలుగు రాష్ట్రాల గ్రామాలకు ఫ్రీజర్ బాక్సుల పంపిణీకి సోనూ హామీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.