మహబూబాబాద్ జిల్లాలో వేర్వేరు కేసుల్లో బాధ్యులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కురవిలో గొర్రెలు దొంగిలించిన ఘటనలో... హనుమంతుని గడ్డ, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ఉపేందర్, కృష్ణలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గొర్రెలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడుతున్న మరిపెడకు చెందిన భరత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు.
వేర్వేరు కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్టు - కురవి
మహబూబాబాద్ జిల్లాలో వేర్వేరు కేసుల్లో బాధ్యులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి గొర్రెలను, రెండు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.