మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో భూమిని చదును చేయిస్తున్నారు. ఇంతలో ఓ చోట పురాతన నంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు బయటపడ్డాయి.
కాలనీ వాసులంతా ఆ విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించారు. జలాభిషేకం చేసి... భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పురాతన కాలంలో అవి బయటపడిన చోట దేవాలయాలు ఉండేవని తమ పూర్వీకులు చెప్పారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం సహాయ సహకారాలతో ఇక్కడ గుడి నిర్మించేందుకు కాలనీ వాసులంతా కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు