జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల విద్యార్థులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని.. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'పార్టీ మార్పుపై రాజీవ్ గాంధీ జయంతి తర్వాత నిర్ణయం'