మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలోని ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ ఎదుట తెరాస, వామపక్షాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస శ్రేణులు ప్రచారం చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని వామపక్ష నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేయడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి చెదురుముదురు ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటేస్తున్న పట్టభద్రులు