ETV Bharat / state

డ్రైవర్​గా మారిన ఎమ్మెల్యే, కండక్టర్​గా మారిన ఎంపీ

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ డ్రైవర్ అవతారమెత్తి బస్సును నడిపారు. ఎంపీ మాలోత్ కవిత కండక్టర్​గా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చారు. అదేంటని అనుకుంటున్నారా.. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డిపో మేనేజర్ మహేష్​లతో కలిసి ప్రారంభించారు.

A driver-turned-MLA, a conductor-turned-MP at mahabubabad
డ్రైవర్​గా మారిన ఎమ్మెల్యే, కండక్టర్​గా మారిన ఎంపీ?
author img

By

Published : Feb 2, 2020, 4:51 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, బస్ డిపో మేనేజర్ మహేష్​లతో కలిసి ప్రారంభించారు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ బస్సును నడుపగా, ఎంపీ మాలోత్ కవిత కండక్టర్ అవతారమెత్తి ప్రయాణికులకు టికెట్లను ఇచ్చారు.

మేడారం జాతరకు మహబూబాబాద్ నుంచి 100 బస్సులు, గూడూరు నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ మహేష్ అన్నారు. ప్రతి బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టెంట్లు వేసి, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి 5-10 నిముషాలకు ఒక బస్సును నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సూచించారు. ఆర్టీసీ బస్సులు మేడారంలోని గద్దెల సమీపం వరకు వెళ్తాయని, భక్తులంతా ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ వాహనాలలో వెళ్లాలని ఎంపీ కవిత కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డ్రైవర్​గా మారిన ఎమ్మెల్యే, కండక్టర్​గా మారిన ఎంపీ?

ఇదీ చూడండి : పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.