మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో... జర్నలిస్టులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఆస్పత్రి వైద్యుడు స్వరూప్ కుమార్ 60 మంది పాత్రికేయులకు ఒక్కొక్కరికీ 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పాత్రికేయుల సేవలు ఎనలేనివని వైద్యుడు స్వరూప్ కుమార్ కొనియాడారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన వైద్యుడికి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది