మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మంగలి తండాలో డెంగీతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. తండాకు చెందిన అశ్వంత్ అనే చిన్నారికి జ్వరం రాగా... గంధంపల్లిలోని ఓ ఆర్.ఎం.పీ దగ్గర చికిత్స చేపించారు. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. బాలుణ్ని ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తరలించారు. రక్తకణాలు భారీగా తగ్గి పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్కు తరలిస్తుండగా... మార్గమధ్యంలోనే బాలుడు మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి..